తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాకు వరద హెచ్చరికలు జారీ చేశారు. ఈరోడ్‌లో ఇప్పటివరకు 358.12 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సత్యమంగళం, గోబిచెట్టిపాలెం, గుండ్రిపాళ్యం, అమ్మపేట ప్రాంతాల్లోని కాల్వలు, చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గోబిచెట్టిపాలెంలో వరి పొలాలు నీట మునిగాయి. పంట నష్టాన్ని అంచనా వేయాలని జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ సిబ్బందిని ఆదేశించారు.