శింగనమల మండలం వెస్ట్ నరసాపురం, చిన్న జలలపురం గ్రామాలలో ఇదేం ఖర్మ అనే పోస్టర్లను బుధవారం విడుదల చేసినట్లు టిఏన్ఏస్ఏఫ్ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి బండి పరశురామ్, బీసీ సెల్ కార్యదర్శి బండి పరశురామ్ లు తెలియజేశారు. అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ధర్ చౌదరి, టూమెన్ కమిటీ సభ్యులు కేశవరెడ్డి, ఆలం నరస నాయుడు ఆదేశాల మేరకు దండు శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోస్టర్లు విడుదల చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కార్యదర్శి సావిత్రమ్మ, ఐటీడీపి నవీన్, రమణ, అమర్ నాథ్ రెడ్డి, చంద్ర, సాయి, నాగేంద్ర, లాలెప్ప టీడీపీ నాయకులు పాల్గొన్నారు.