మడకశిర మండలంలో ఖరీఫ్ సాగులో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సంబంధించి రూ. 12. 67 లక్షల నష్టపరిహారం రైతులకు విడుద లైనట్లు వ్యవసాయశాఖ అధికారి వీరనరేష్ బుధవారం తెలిపారు. మండల వ్యాప్తంగా గత జూలై నుంచి అక్టోబరు వరకు అధికవర్షాకు దెబ్బతిన్న 250 ఎకరాల్లోని మొక్కజొన్న, పత్తి, వేరుశనగ పంటలకు 204 మంది రైతులకు పరిహారం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం రైతుల ఖాతాల్లోకి జమరూ. 12. 67 లక్షల ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేశామన్నారు.