ఇంటర్మీడియట్ పాఠ్య పుస్తకాలెక్కడ? అంటూ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. అందులో భాగంగా బుధవారం అనంతపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దాదాపు 40 వేలకు మంది దాకా ఉన్నారన్నారు. విద్యార్థు లకు ఇంతవరకు పాఠ్య పుస్తకాలు ప్రభుత్వం నుంచి అందలేదన్నారు.