హిందూపురం పట్టణంలోని ముక్కడిపేట బీసీ హాస్టల్ సమీపంలో బియ్యం పడేసి వాటికి నిప్పు సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే బీసీ హాస్టల్ సమీపాన ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బియ్యం పడవేశారు. అ బియ్యం హాస్టల్వారు పడవేశార, సమీపంలోని ఇల్ల నుంచి తెల్చి పడవేశారా, అంగన్వాడీ కేంద్రాల నుంచి తెచ్చి పారావేశారో అన్నది తెలియదు.
ఒక వేళ బియ్యం ముగ్గిపోయాయా, లేదా ప్లాస్టి బియ్యం అయి ఉంటాయని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా వాటికి నిప్పు పెట్టడంతో ఎందుకు నిప్పంటిచారు అని చర్చించుకుంటున్నారు. అయితే పక్కనే ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయం చాల రోజులుగా మూత పడిందని అందులో బియ్యం ముగ్గి పోవడంతో వారు పడవేసి ఉంటారని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయంపై సంబంధిత అధికారులు పర్యవేక్షించి నాజానిజాలు వెలికితీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.