సరుబుజ్జిలి మండలానికి చెందిన జనసేన నాయకులు పైడి మురళీమోహన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. ఈ సందర్భంగా 2019 నుండి నియోజకవర్గ సమస్యలు, జన సైనికులపై జరుగుతున్న దాడులను అధినేతకు ఆయన వివరించారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ జన సైనికులపై జరిగిన దాడులను చూస్తూ ఊరుకోమని అధికార ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతామని తెలిపారు. ఆయనతోపాటు నియోజకవర్గ నాయకులు పేడాడ రామ్మోహన్ రావు, తదితరులు ఉన్నారు.