టర్కీలో ఓ వ్యక్తి అనూహ్య రీతిలో చనిపోయాడు. ఓజ్గుర్ గెవ్రెకోగ్లు (32) ఇటీవల తన స్నేహితులతో కలిసి వేటకు వెళ్లాడు. తన వెంట పెంపుడు శునకాన్ని కూడా తీసుకెళ్లాడు. లోడ్ చేసిన షాట్ గన్ను ఓ చోట పెట్టాడు. అకస్మాత్తుగా అతడి పెంపుడు కుక్క వచ్చి ట్రిగ్గర్‌పై కాలు పెట్టింది. తుపాకీ పేలి, బుల్లెట్ నేరుగా వచ్చి ఓజ్గుర్ గెవ్రెకోగ్లుకు తగిలింది. దీంతో అతడు చనిపోయాడు. టర్కీలోని శాంసన్ ప్రావిన్స్‌లోని అలకామ్ జిల్లా కిజ్లాన్ ప్రాంతంలో నవంబర్ 27న ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.