తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని టీటీడీ భావించింది. కాగా శ్రీవారి సర్వ దర్శనానికి ప్రస్తుతం దాదాపు 30 గంటలు పడుతోందని టీటీడీ తెలిపింది. అయితే తొలుత ఈ బ్రేక్ దర్శనాలను ఉదయం పది గంటల నుంచి అమలు చేయాలని భావించినా, ఆ సమయంలో కళ్యాణోత్సవం భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని టీటీడీ తెలిపింది.