పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు ఉండవల్లి నివాసం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు బయల్దేరి వెళ్లారు. నేటి నుంచి మూడ్రోజుల పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ‘‘రాష్ట్రానికి ఇదేం ఖర్మ’’ కార్యక్రమం చేపట్టనున్నారు. కాసేపట్లో కలపర్రు టోల్ ప్లాజాకు టీడీపీ అధినేత చేరుకోనున్నారు. టోల్ ప్లాజా నుంచి తెలుగు దేశం శ్రేణులు భారీ బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈరోజు మధ్యాహ్నం ఏలూరు జిల్లా విజయరాయిలో జరగనున్న బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని మాట్లాడనున్నారు. 50 రోజులు-50 లక్షల కుటుంబాలే టార్గెట్గా ఈ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు.