ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ సీఎస్ కు నూతన పదవి కట్టబెట్టిన సర్కార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 30, 2022, 01:57 PM

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ నేడు పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే రిటైర్ అయిన తర్వాత సమీర్ శర్మ కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పోస్టు సృష్టించింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో సమీర్ శర్మను ప్రభుత్వ ఎక్స్ అఫీషియో చీఫ్ సెక్రటరీ హోదాలో నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ గానూ సమీర్ శర్మను ప్రభుత్వం నియమించింది. కాగా, ఇప్పటికే కేఎస్ జవహర్ రెడ్డిని ప్రభుత్వం నూతన ప్రధాన కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com