బంగాళదుంప అంటే ఇష్టపడనివారు ఉండరు. ఈ బంగాళాదుంప ని ప్రతి కూరగాయలతో కలిపి వండుతుంటుంటారు. కానీ వీటిని ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. బంగాళదుంపలను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన ఎసిడిటీ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. కొంతమంది బంగాళాదుంపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉబ్బరం సమస్యను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే షుగర్ పేషెంట్లు బంగాళదుంపలను అస్సలు తినకూడదు. బంగాళదుంప వినియోగం రక్తంలో చక్కెరను బాగా పెంచుతోంది. అంతేకాకుండా రక్తపోటు ఉన్నవాళ్లు కూడా బంగాళదుంపలకు దూరంగా ఉండాలి. ఎక్కువ బంగాళదుంపలు తినడం వల్ల రక్తపోటు ఎక్కువయ్యే ఛాన్స్ ఉన్నందున, బంగాళదుంపలను తక్కువగా మాత్రమే తినాలి.