పోస్ట్ కోవిడ్ లక్షణాలు అనేకమందిని బాధిస్తున్నాయి. తాజాగా కోవిడ్ వల్ల పేగుల్లోని మంచి, చెడు బ్యాక్టీరియాల మధ్య ఉండే ఆరోగ్యకర సమతుల్య దెబ్బతింటున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ముఖ్యంగా యాంటీబయోటిక్స్ చికిత్స పొందేవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. కొవిడ్ విజృంభణ వేళ చాలామంది బాధితులను గ్యాస్ సమస్యలు వేధించాయి. దీనిపై దృష్టి సారించిన రట్జర్స్ యూనివర్సిటీ పరిశోధకులు, ఆరోగ్యవంతులు, కొవిడ్ బాధితుల పేగుల్లోని బ్యాక్టీరియాను విశ్లేషించారు. ఇన్‌ఫెక్షన్, యాంటీబయోటిక్స్ కారణంగా పేగుల్లోని సూక్ష్మజీవుల మధ్య సమతుల్యత దెబ్బతింటోందని గుర్తించారు.