ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకోమన్నందుకు శ్రద్ధా వాకర్ ను ఆమె ప్రియుడు ఆఫ్తాబ్ దారుణంగా హత్య చేసి ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికాడు. కాగా, ఈ హత్య కేసులో ఆఫ్తాబ్ 'పాలిగ్రాఫ్' పరీక్షలో సంచలన విషయాలు బయటపెట్టాడు. శ్రద్ధాను తానే చంపానని, ఆమెను చంపినందుకు తనకు ఎలాంటి బాధ, పశ్చాత్తాపం లేదని వెల్లడించాడు. శ్రద్ధాను దారుణంగా చంపి ఆమె శరీర భాగాలను అడవిలో పడేసినట్లు ఒప్పుకున్నాడు. అదే విధంగా తనకు చాలామంది అమ్మాయిలతో సంబంధాలున్నాయని ఆఫ్తాబ్ వెల్లడించాడని సమాచారం. కాగా, డిసెంబర్ 5న ఆఫ్తాబ్ కు నార్కో పరీక్షలు చేయనున్నారు.