మరో ఏడాదిలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు విరాళాల మూటలు అందుతున్నారు. ముఖ్యంగా అధికార బీజేపీ ఖాజానాలో కోట్లు జమ అవుతున్నాయి. గడిచిన ఏడాదిలో బీజేపీకి రూ.614.53 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినట్లు వెల్లడైంది. అటు ప్రతిపక్ష కాంగ్రెస్ కు వచ్చిన విరాళాలకంటే ఇది ఆరు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. కాంగ్రెస్ రూ.95.46 కోట్ల విరాళాలతో రెండో స్థానంలో ఉంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ రూ.44.54 కోట్ల విరాళాలతో మూడో స్థానంలో నిలిచింది. బీజేపీ, కాంగ్రెస్ సహా జాతీయ పార్టీలు తమకు వచ్చిన విరాళాల గురించిన సమాచారాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించాయి.