అశ్లీలత, అసభ్య కంటెంట్ వ్యాప్తిని అడ్డుకునేందుకు యూట్యూబ్ కఠిన చర్యలు చేపడుతోంది. తాజాగా భారత్ లో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రసారమవుతోన్న 17 లక్షల యూట్యూబ్ వీడియోలను తొలిగించినట్లు యూట్యూబ్ తెలిపింది. 2022 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 1.7 మిలియన్ వీడియోలు తొలిగించినట్లు కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదికలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా 56 లక్షల వీడియోలు తొలిగించినట్లు వెల్లడించింది.