బుధవారం ఉదయం బెంగాల్ సీల్దా సమీపంలో రాణాఘాట్ లోకల్ రైలు పట్టాలు తప్పడంతో పాటు మరో లోకల్ రైలును ఢీకొట్టింది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం ప్రయాణికులను రైలు నుంచి కిందకు దించారు. సిగ్నలింగ్ గందరగోళమే ప్రమాదానికి దారితీసిందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.