5జీ నెట్‌వర్క్ సేవలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. రన్‌వేకి ఇరువైపులా 2 కిలోమీటర్ల వరకు 5జీ సేవలను అందించవద్దని టెలికాం కంపెనీలను ఎయిర్‌పోర్టు ఆదేశించింది. అలాగే, రన్‌వేకు 910 మీటర్ల వరకు కంపెనీలు సేవలు అందించకూడదని పేర్కొంది. దీంతో విమానంలో ప్రయాణించే వారు, విమానాశ్రయం రన్‌వేకు 2 కి.మీ దూరంలో ఉన్న వారు ఈ సేవలను పొందలేరు. దేశంలోని చాలా విమానాశ్రయాలు చిన్నవిగా ఉన్నాయని, దీంతో 5జీ సేవలను అందించడం కష్టమని అధికారులు చెబుతున్నారు.