తమ్మిలేరులో తాను ఇసుక తవ్వినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని చంద్రబాబుకు దెందులూరు వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సవాల్ విసిరారు. రెప్పార్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. గత ఐదేళ్ల పరిపాలనలో ఒక్క హామీని కూడా అమలు చేయని చంద్రబాబుకు ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. దెందులూరు నియోజకవర్గంలో కార్యక్రమం నిర్వహించి తనపై చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఏలూరులో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి విలేకరుల సమావేశం నిర్వహించారు.