కాంగ్రెస్ పార్టీ నాయకులు, పిసిసి సెక్రెటరీ, పీలేరు నియోజకవర్గం ఇన్ చార్జ్ గా వ్యవహరించిన కెఎస్ ఆగ మొహియుద్దీన్ ఆ పార్టీని వీడి వైఎస్ఆర్సిపి తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం మదనపల్లిలో ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకు వైఎస్సార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఆగా మోహిద్దీన్ మాట్లాడుతూ వైసిపి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.