మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ దౌర్జన్యంగా కొట్టి, దుర్భాషలాడి హింసించిన నేరంపై పి.రమణ అనే వ్యక్తికి రెండు సంవత్సరాల ఏడు నెలల జైలు శిక్ష విధిస్తూ కడప జిల్లా, తంబళ్లపల్లె జ్యుడీ షియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ర్టేట్ కోర్టు ఇనచార్జ్ న్యాయ మూర్తి జీసీ అసిఫా సుల్తానా బుధవారం తీర్పునిచ్చా రు. తంబళ్లపల్లె మండలం రేణుమాకులపల్లె పంచాయ తీ దండువారిపల్లెకు చెందిన రమణ 2017లో అదే గ్రా మానికి చెందిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ దౌర్జన్యంగా కొట్టడంతో పాటు, దుర్భాషలాడి హింసించా డు. ఈ నేరంలో అప్పట్లో అతనిపై తంబళ్లపల్లె పోలీస్టేషన్లో క్రైం నెం:3/2017 ఐపీసీ 354, 324, 506 (సీసీ నెం: 52/2017) సెక్షన్ల కింద కేసు నయోదైంది. ఈ కేసు విచారించిన తంబళ్లపల్లె జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ర్టేట్ కోర్టు ఇనచార్జ్ న్యాయమూర్తి నిం దితు డికి రెండు సంవత్సరాల ఏడు నెలల జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు.