పాలకోడేరు, యనమదుర్రు డ్రెయిన్‌లో కలుషిత జలాలు రావడంతో డ్రెయిన్‌లోని పెద్ద పెద్ద చేపలు ఒక్కసారిగా తేలిపోయాయి. దీంతో జాలరులు గొల్లలకోడేరు – పాలకోడేరు బ్రిడ్జిపై నుంచి వలలు వేసి చేపలు పట్టారు. సుమారు ఐదు కేజీల నుంచి 10 కేజీల వరకు జెల్లలు, కొర్రమేనులు, తెల్ల చేపలు, క్యాట్ ఫిష్‌లు తదితర చేపలు వలలో చిక్కాయి. వాటి ని కొనేందుకు చేపల ప్రియులు ఎగబడ్డారు. దీంతో ఆ ప్రాంతం చేపలు మార్కెట్‌ను తలపించింది. డ్రెయిన్‌లోకి కొన్ని ఫ్యాక్టరీలు వ్యర్థ జలాలు వదలడం వల్లే చేపలు తేలుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.