అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే రాపాక వర ప్రసాదరావు అన్నారు. రాజోలు, మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కేతా శ్రీను అధ్యక్షతన బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. మండల సర్వసభ్య సమావేశానికి అధి కారులు పక్కా సమాచారంతో రావాలన్నారు. ప్రజాప్రతినిధులు అడిగే ప్రశ్న లకు అధికారులు సమాధానం చెప్పాలన్నారు. ఎంపీటీసీలు, సర్పంచ్‌లు అడి గిన ప్రశ్నలకు వివిధ శాఖల అధికారులు సమాధానమిచ్చారు. ఎంపీడీవో ఐఈ కుమార్, తహశీల్దార్ బి.ముక్తేశ్వరరావు, జడ్పీటీసీ మట్టా శైలజ, వైస్ ఎంపీపీలు పొలమూరి శ్యామ్‌బాబు, యింటిపల్లి ఆనందరాజు, సర్పంచ్ కడలి సత్యనారాయణ, కోఆప్షన్ సభ్యుడు షేక్ ఇస్మాయిల్, ఎంపీటీసీలు శిరి గినీడి వెంకటేశ్వరరావు, బొడ్డు కృష్ణారావు, ఉండ్రు సూర్యారావు పాల్గొన్నారు.