శ్రీకాకుళం జిల్లా, మురపాక మద్యం దుకాణంలో సోమవారం అర్ధరాత్రి చోరీకి గురైన మద్యం సీసాలను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. దొంగలు వాచ్మన్ కాలు చేతులను కట్టేసి మద్యం దుకాణానికి రంధ్రం చేసి 7,087 సీసాలను అపహరించిన విషయం తెలిసిందే. వీటి విలువ సుమారు రూ.11.57 లక్షలు వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో లావేరు ఎస్ఐ ఎ.కోటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బుధవారం కేశవరాయునిపాలెం లోని ఓ తోటలో వరి గడ్డి వాములో దాచి పెట్టిన మద్యం సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి అట్టలను కాల్చివేశారు. నిందితులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు.