కోవూరు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధి కమిటీ సమావేశం ప్రిన్సిపాల్ లక్ష్మీప్రసూన అధ్యక్షతన జరిగింది. సమావేశంలో డీఏఏబీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజనబాబురెడ్డి మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషి చేస్తామన్నారు. కళాశాల అభివృద్ధికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కవరగిరి శ్రీలత, కశాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ నెట్రంబాక సాయి , అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.