తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను అరెస్ట్ చేయడం మహిళల భద్రతకు భంగం కలిగించడమే అని లైఫ్ వరల్డ్ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఉదయ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లో పాదయాత్రలో తనపై టీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన దాడిని నిరసిస్తూ చేపట్టిన ఆందోళన సందర్భంగా షర్మిలను పోలీ్సస్టేషనకు తీసుకెళ్లిన తీరు బాధాకరమన్నారు. కనీసం ఒక మహిళ అని కూడా చూడకుండా ఆమె వాహనాన్ని క్రేన ద్వారా లాక్కెళ్లడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్య గంగిరెడ్డి, నాగేంద్ర, మనోజ్, లక్ష్మి, లలిత, అబ్దుల్ రహీం, భారతి, వైసీపీ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.