పులివెందులు నియోజకవర్గం వేముల మండలం వ్యాప్తంగా లింగ వివక్షత వ్యతిరేక జాతీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా వేముల గ్రామంలో డ్వాక్రా మహిళలతో ఎన్జీవోలు యువతతో అవగాహన సమావేశాన్ని అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ డిఆర్డిఏ ఆంజనేయులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగము ఆడ, మగ అనే భేదాభిప్రాయాలు లేకుండా అందరికీ సమాన హక్కులు సమాన విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతున్నదని, తల్లిదండ్రులు బాల బాలికల విద్య భేదాభిప్రాయం లేకుండా చూడాలని కోరారు. మహిళలు పైన జరిగే అఘాయిత్యాలు, అత్యాచారాలు, గృహహింస ర్యాగింగ్ పనిచేసే ప్రదేశంలో ఇబ్బందులు కల్పించడం మొదలగు చట్ట వ్యతిరేక కార్యకలాపాల పట్ల మహిళల అవగాహన కలిగి ఉండి, మహిళలపై లైంగిక వేధింపులు నిరోధక చట్టం 2013 ప్రకారము పిర్యాదులు చేయవచన్నారు.