ఏపీలో సంక్షేమ హాస్టల్స్ జైల్ కన్నా దారుణంగా ఉన్నాయని, చాలా హాస్టల్స్ శిథిలావస్థకు చేరుకున్నాయని, మౌలిక సదుపాయాలు లేవని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మంత్రులు ఎందుకు సంక్షేమ హాస్టల్స్‌ను సందర్శించడం లేదని ప్రశ్నించారు. మెస్ చార్జీలు పెంచలేదని, నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వడం లేదని విమర్శించారు. టిఎన్ఎస్ఎఫ్ నేతలు హాస్టల్స్‌ను సందర్శిస్తుంటే... ఆంక్షలు పెట్టారని, సర్క్యులర్ జారీ చేశారని మండిపడ్డారు. సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. సంక్షేమ హాస్టల్స్ సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 5న రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు.