మాజీ మంత్రి కొడాలి నాని పై టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు ఫైర్ అయ్యారు. కొడాలి నాని పాలనలో గుడివాడకు ఇదేం కర్మ అని వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... నాలుగు దశాబ్దాలుగా గుడివాడ రాజకీయాల్లో అవినీతి లేకుండా రావి కుటుంబం పనిచేస్తోందని తెలిపారు. మూడున్నరెళ్ళ వైసీపీ పాలనలో కొడాలి నాని బినామీలతో వేలాది కోట్ల దోపిడీ చేశారని ఆరోపించారు. ఆధారాలతో సహా నాని అవినీతిని బయటపెడతానన్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయకుండా కొడాలి నాని పారిపోతారని యెద్దేవా చేశారు. టిడ్కో ప్లాట్ల తొలగింపు లబ్ధిదారులతో కలిసి గుడివాడలో జరిగే సీఎం సభను ముట్టడిస్తామని రావి వెంకటేశ్వరరావు వెల్లడించారు.