రాష్ట్రంలోని 29 బేవరేజ్ డిపోలలో పనిచేస్తున్న హమాలి కార్మికులకు ఎగుమతి రేట్లు పెంచాలని ఏపీఎస్ బిసిఎల్ హమాలీల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. వెంకటసుబ్బారెడ్డి, కడప డిపో గౌరవ అధ్యక్షులు పి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఎగుమతి కూలి రేటు పెంచాలని ఒప్పందం 2021 అక్టోబర్ నెలకు పూర్తయిందని అన్నారు. ఇప్పటికి దాదాపు 13 నెలలు పూర్తయిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం కార్మికులను మరింత అప్పుల ఊబిలోకి నెట్టడమే దీనికి నిదర్శనం అన్నారు. ధరలు మాత్రం రోజురోజుకీ పెరుగుతూ ఉన్నాయి రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో కార్మికులు ఉన్నారు.
కనీసం నిత్యవసర సరుకులు కొనలేని పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారు కావున ఏపీ బీసీఎల్ యాజమాన్యం స్పందించి తక్షణమే రూ. 7 ఉన్న ఎగుమతి కూలిని రూ. 10లకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తూనే సమ్మె చేసేదానికైనా సిద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో డిపో ప్రధాన కార్యదర్శి ఆర్ సుబ్బరాయుడు, కోశాధికారి ఎల్ మనోహర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కే రఘురామయ్య, కార్యదర్శి రెడ్డి ప్రసాద్, కమిటీ సభ్యులు ఎన్ సుబ్బారెడ్డి, ఏ నరేష్, పి ఓ కొండారెడ్డి, ఆర్ భరత్ కుమార్ రెడ్డి, యు వేణుగోపాల్ రెడ్డి డిపో కార్మికులందరూ పాల్గొన్నారు.