ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాపం ఢిల్లీ వాసులకు ఆ ఉపవాసం తప్పదటా

national |  Suryaa Desk  | Published : Thu, Dec 01, 2022, 10:41 PM

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ వాసులు మద్యం ఉపవాసం పాటించక తప్పని పరిస్థితి వచ్చింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు లిక్కర్ విక్రయాలు బంద్ కానున్నాయి. ఈ నెల 4న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం నుంచి మందు బంద్ కానుంది. రేపు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో రేపు సాయంత్రం 5.30 గంటల నుంచి డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు వైన్ షాపులు, బార్లు, సేల్ ఔట్ లెట్స్ మూతపడనున్నాయి.  ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను జారీ చేసింది. అనధికారికంగా ఎవరూ లిక్కర్ ను నిల్వ చేయడం కానీ, తరలించడం కానీ చేయకుండా పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు, డిసెంబర్ 7న కౌంటింగ్ జరగనుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com