బెంగళూరులో ఔటర్లో చిరుతపులి కలకలం సృష్టించింది. కెంగేరిప్రాంతంలోని తురహళ్లి సమీపంలో రెండు రోజులుగా చిరుత సంచరిస్తుందని స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. తాజాగా జింకను వేటాడుతూ చిరుత రోడ్డుపైకి దూసుకొచ్చింది. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో నాలుగు చిరుతలు కనిపించాయని ఎవరో ప్రచారం చేయడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనులు నెలకొన్నాయి. తురహళ్లి అటవీ కారిడార్‌కి ఆరు కిలోమీటర్ల దూరంలో బన్నెరఘట్ట నేషనల్ పార్క్ ఉంది. అందువల్ల ఇక్కడ తరుచుగా వన్యప్రాణులు కనిపిస్తాయని అధికారులు చెప్పారు.