సరిహద్దు వివాదంపై సుప్రీంలో విచారణ జరుగుతున్న సమయంలో మహారాష్ట్ర మంత్రులు బెళగావిని సందర్శించడం సరికాదని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్పామన్నారు. మహారాష్ట్ర మంత్రులను కర్ణాటకలో అడుగుపెట్టనివ్వరా అన్న ప్రశ్నకు గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయో తాము కూడా అదే పాటిస్తామన్నారు. మహారాష్ట్రలో కన్నడ మాట్లాడేవారి సంక్షేమంపై ఆందోళన వ్యక్తం చేసాకే, మహారాష్ట్ర ప్రభుత్వం జత్ తాలూకా ప్రాంతాల్లో నీటి పారుదల ప్రాజెక్టు కోసం రూ. 2 వేల కోట్లు ప్రకటించిందని బొమ్మై అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల అక్కడ కన్నడ మాట్లాడే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.