ఉత్తరాఖండ్ లోని జౌలిలో భారత్-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంపై భారత్ లో అమెరికా దౌత్య వేత్త ఎలిజెబెత్ జోన్స్ స్పందించారు. ‘ఇది వారికి అనవసరం’ అంటూ చైనా తీరును కొట్టిపారేశారు. మరో వైపు డ్రాగన్ వ్యాఖ్యలపై భారత్ కూడా ఘాటుగా స్పందించింది. ‘భారత్ తనకు నచ్చిన వారితో యుద్ద విన్యాసాలు చేస్తుంది. ఇందులో మూడో దేశం తల దూర్చేందుకు ఎలాంటి అధికారం లేదు’ అని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.