తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదేమి కర్మ కార్యక్రమాన్ని శనివారం రోద్దం మండలం తురకలాపట్నం గ్రామంలో జిల్లా అధ్యక్షులు బి కె. పార్థసారథి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మండల కన్వీనర్ నరహరి పేర్కొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సాయంత్రం 4 గంటలకు జరుగు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి రోద్ధం మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, తెలుగు మహిళలు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.