ఐరన్ బాక్స్ లో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ప్రయాణికున్ని బెంగళూరు కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి కెంపెగౌడ విమానాశ్రయానికి నవంబర్ 29న ఓ 22 ఏళ్ల యువకుడు వచ్చాడు. తనిఖీల్లో భాగంగా అనుమానంతో అత్యాధునిక స్కానర్ ద్వారా చెక్ చేయగా ఐరన్ బాక్స్ లో స్టీల్ ప్లేట్ కింద దాచిన 3015.13 గ్రాముల బంగారం బయటపడింది. దీని విలువ సుమారు రూ.1.60 కోట్లు ఉంటుందని అధాకారులు తెలిపారు.