హెచ్ఐవీ బాధితులకు శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ అందించారు. వైరస్ ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన వ్యాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తైనట్లు వెల్లడించారు. ప్రయోగ దశలో ఉన్న ఈ వ్యాక్సిన్ యాంటీబాడీలను మెరుగ్గా ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. ఈ 2 డోసుల వ్యాక్సిన్ 8 వారాల వ్యవధిలో తీసుకోవాల్సి ఉంటుందన్నారు. హెచ్ఐవీలో ఉండే ఓ ప్రోటీన్ ఇంజినీరింగ్ వెర్షన్ తో ఈ వ్యాక్సిన్ తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ వ్యాధి సంక్రమణం నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని వివరించారు.