ప్రపంచంలో ఇప్పుడు జీవించి ఉన్న తాబేళ్లన్నంటికీ పెద్దన్న లాంటి ఈ తాబేలు. వయసు 190 ఏళ్లు. బ్రిటీష్ పాలనలో ఉన్న సెయింట్ హెలెన్ దీవి దీని నివాసం. అయితే ఏకంగా గవర్నర్ అధికారిక భవనమే దీని కేరాఫ్ అడ్రస్. సీచెల్స్ జాతికి చెందిన ఈ భారీ తాబేలుకు అధికారులు జోనాథన్ అని పేరు పెట్టగా.. ఎక్కువ వయసున్న తాబేలుగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ప్రపంచం మొత్తమ్మీద ఉన్న సీచెల్స్ తాబేళ్ల సంఖ్య కేవలం 80 నుంచి 100 ఏళ్ల లోపేనని అధికారులు చెబుతున్నారు.