చెన్నైలోని రామేశ్వరం రామనాథ స్వామి ఆలయానికి ఉగ్రవాదం బెదిరింపులు కలకలం రేపాయి. ఈ మేరకు కేంద్ర ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో, ఆలయ ఉత్తర, దక్షిణ పడమర వీధుల్లో వాహనాల రాకపోకలను పోలీసులు నిషేధించారు. సమీప ప్రాంతాల్లో గస్తీ తీవ్రం చేశారు. ఇటీవల ఆలయ నిషేధిత ప్రాంతాల్లో పలువురు సంచరించడం సహా తమ సెల్ ఫోన్ లో ఆలయ రాజగోపురం, పరిసర ప్రాంతాలను ఫోటోలు తీశారనే ఫిర్యాదుతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.