కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య చిన్నపాటి చికిత్స కోసం శుక్రవారం ఉదయం హెచ్ఏఎల్ రోడ్డులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు శస్త్రచికిత్స చేసి.. సాయంత్రం డిశ్చార్జి చేసినట్లు ప్రకటించారు. నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ఇంటి పట్టునే విశ్రాంతి తీసుకుంటారని ఎవరూ భేటీకీ రావొద్దని ఆయన కార్యాలయ కార్యదర్శి కోరారు.