బెస్తవారిపేట సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఎస్సై మాధవరావు శనివారం నో యాక్సిడెంట్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. ఇక చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్షతోపాటు భారీ జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు.