ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ధూప , దీప, నైవేద్య పథకంలో భాగంగా ఆలయ పూజారులకు నిధులు మంజూరు నేపథ్యంలో కొరిసపాడు మండలం అనమనుమూరు గ్రామానికి చెందిన పూజారి చల్లా వెంకటేశ్వర్లకు నిధులు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా శనివారం నాడు గ్రామ సర్పంచ్ జంపు హరిబాబు ప్రభుత్వం మంజూరు చేసిన 5000 రూపాయల నగదును పూజారికి అందజేశారు. ఆర్థిక సహాయాన్ని అందజేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.