బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలం అప్పలంపేట గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు కోటి రూపాయలు వ్యయంతో అప్పలంపేట గ్రామం నుంచి వంతరాం జంక్షన్ వరకు నూతనంగా నిర్మించబోయే బి. టి. రోడ్డు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు భూమిపూజ చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నర్సుపల్లి ఉమాలక్ష్మీ, జడ్పీటీసీ గర్బాపు లుర్థు, వైస్ ఎంపీపీ చెపేన సత్యనారాయణ, సర్పంచ్ గురవాన పార్వతి, గొలుగు వలస సర్పంచ్ జి. శంకరరావు, బొమ్మి శ్రీనివాసరావు, బోను అప్పలనాయుడు, తెంటు సత్యం నాయుడు, తదితరులు పాల్గొన్నారు.