డుంబ్రిగుడ మండలంలోని గుంటసీమ పంచాయతీ పరిధి సోబురు గ్రామానికి చెందిన విద్యార్థి గడ్డంగి. సామ్యూల్ పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస విడిచాడు. తల్లిదండ్రుల కథనం ప్రకారం. విశాఖలోని ఆరిలోవ ఎంపీపీ పాఠశాల వద్ద సామ్యూల్ 6వ తరగతి చదువుతున్నారు. సామ్యూల్ గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురయ్యారు. దీనితో పాఠశాల సిబ్బంది ఆస్పత్రికి తీసుకెళ్లకుండా స్వగ్రామానికి గ్రామానికి పంపించేశారు. దీనితో సామ్యూల్ తల్లిదండ్రులు పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. సామ్యూల్ చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం 7గంటలకు తుది శ్వాస విడిచాడు. సామ్యూల్ మృతితో సోబురు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని మృతుడు సామ్యూల్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.