ప్రపంచ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నిజాంపట్నంలోని ఎంపీ మోపిదేవి నివాసంలో దివ్యాంగులు కలిసి కేకు కట్ చేశారు. ఈనెల 9వ తేదీన బాపట్ల పట్టణంలో జరిగే రాష్ట్ర దివ్యాంగుల సభకు ఎంపీ మోపిదేవిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ తెలిపారు.