మలేషియాలోని సబాహ్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన జరిగింది. లాహద్ దాతు నది తీరంలో తండ్రీకొడుకులు గురువారం చేపల వేటకు వెళ్లారు. ఆ సమయంలో అకస్మాత్తుగా 11 అడుగుల మొసలి వారిపై దాడి చేసింది. బాలుడిని తండ్రి కళ్ల ముందే మింగేసింది. తన కొడుకును కాపాడుకోవడానికి తండ్రి చాలా ప్రయత్నించాడు. కానీ కొడుకును కాపాడుకోలేక పోయాడు. ఈ క్రమంలో తండ్రిపైనా మొసలి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రిలో చేర్పించారు. మొసలి ఆ చిన్న పిల్లాడిని సజీవంగా తినేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతంది. ఇది తమకు కన్నీరు పెట్టించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.