ఇటీవల ఓ కొరియన్ అమ్మాయి ముంబయిలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా ఓ యువకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనను కాపాడిన ఇద్దరు ఇండియన్ యువకులకు ఆమె ట్రీట్ ఇచ్చింది. ఆదిత్య, అధర్వ అనే యువకులతో కలిసి ఆమె రెస్టారెంట్ లో భోజనం చేసింది. వాళ్లద్దరినీ ‘ఇండియన్ హీరోస్’ అంటూ పరిచయం చేసింది. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేయగా నెట్టింట వైరల్ గా మారింది.