చైనాలో జీరో కొవిడ్ పాలసీ ఎత్తేస్తే భారీగా మరణాలు సంభవించే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో భారీగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం జీరో కోవిడ్ విధానం తీసుకురాగా.. నిరసనలు పెల్లుబికాయి. దీంతో ఆంక్షల సడలింపునకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆంక్షలు పూర్తిగా ఎత్తేస్తే దాదాపు 20 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉందని గ్వాంగ్జీ డిసీజ్ కంట్రోల్ హెడ్ జౌ జియాటంగ్ అంచనా వేశారు. అలాగే కొవిడ్ కేసులు 23 కోట్లకు చేరే అవకాశం ఉందని షాంఘై జర్నల్ పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు.