నర్సీపట్నం మున్సిపాలిటీ సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగిని కర్రి వెంకట రమణిపై శుక్రవారం 8 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బ్లేడుతో దాడి చేసి గాయపరిచినట్లు టౌన్ ఎస్ఐ గోవిందరావు తెలిపారు. విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న ఆమె మెడలో చైను తెంపుకుపోవడానికి అగంతకుడు ప్రయత్నించాడని ప్రతిఘటించిన ఆమెను బ్లేడుతో మెడ, చేతిపై గాయపరచాడని ఎస్సై తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.