ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంపై ఈడీ దృష్టి సారించింది. ఈడీ 26 మందికి నోటీసులు జారీ చేసింది. రూ.234 కోట్ల నిధుల మళ్లింపుపై కేసు నమోదైంది. పలు షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు గుర్తించింది. మాజీ చైర్మన్ గంటా సుబ్బారావు, మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణలకు నోటీసులు ఇచ్చారు. ఓఎస్డీ నిమ్మగడ్డ కృష్ణ ప్రసాద్‌కు కూడా నోటీసులు జారీ చేశారు. రేపు హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసు జారీ చేసింది.