మీకు టీ ఎక్కువగా తాగే అలవాటు ఉందా? అయితే ఇప్పట్నుంచి కచ్చితంగా లెమన్ టీ ని తాగండి. లెమన్ టీతో ఎన్నో ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలో విటమిన్ సి, విటమిన్ బి 6, పొటాషియం ఇంకా అలాగే మెగ్నీషియం వంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఇవి చాలా బాగా సహాయపడతాయి. అలెర్జీలు ఇంకా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో ఇవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.లెమన్ టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థను కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒక కప్పు నిమ్మ టీ మీ ఒత్తిడిని తగ్గించడానికి, మీకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.